Jun 28, 2017
73 Views
0 0

ఇక ఆధార్‌తో పాన్ లింకు త‌ప్ప‌నిస‌రి

Written by

ఆధార్ నంబ‌ర్‌తో పర్మ‌నెంట్ అకౌంట్ నంబ‌ర్ (పాన్‌)ను లింకు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నోటీస్ జారీ చేసింది. జులై 1 నుంచి ఇది అమ‌ల్లోకి రానున్న‌ది. ఇప్ప‌టికే ఇన్‌క‌మ్ ట్యాక్స్ నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించిన ప్ర‌భుత్వం.. పాన్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన విష‌యం తెలిసిందే. ఒక‌టికి మించి పాన్ కార్డుల‌ను ఉప‌యోగించి ట్యాక్స్ ఎగ్గొట్టేవారికి చెక్ పెట్ట‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. జులై 1, 2017లోపు పాన్ కార్డు పొందిన ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్‌తో లింకు చేయాల్సిందేన‌ని ఆదాయ శాఖ స్ప‌ష్టంచేసింది. ఇప్ప‌టికే 2 కోట్ల 7 ల‌క్ష‌ల మంది ట్యాక్స్ పేయ‌ర్స్ త‌మ పాన్‌ను ఆధార్‌తో లింకు చేసుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 25 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డ‌ర్స్ ఉన్నారు. అటు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి ఆధార్‌, పాన్ లింకు త‌ప్ప‌నిస‌ర‌ని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ స్ప‌ష్టంచేసింది.

Article Categories:
National · News

Leave a Reply