Apr 27, 2017
97 Views
0 0

తెలంగాణకు ఏకైక బాహుబలి కేసీఆర్ : కడియం

Written by

తెలంగాణ కోసం రాష్ట్రం నలుమూలలు తిరిగి, తెలంగాణ బతుకులను తెలుసుకుని, రైతుల బాధలు చూసి, ఆడబిడ్డల అభద్రతా భావం చూసి, తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ఏకైక బాహుబలి కేసీఆర్ అని మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ 16వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి అధికంగా నిధులు కేటాయించిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమిషన్లకు ఆశపడి ప్రజల సొమ్మును దోచుకున్నారని కడియం తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదవానికి ఆకలి గురించి కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదని ఆయన దుయ్యబట్టారు.

Article Tags:
·
Article Categories:
News · Telangana

Leave a Reply