Apr 27, 2017
80 Views
0 0

టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు పోటెత్తిన వాహనాలు

Written by

టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు వాహనాలు పోటెత్తాయి. మానవహారాన్ని తలపిస్తున్నది వాహనహారం. వరంగల్ నగరం వైపు వెళ్తున్న వాహనాలను చూస్తుంటే.. మానవహారం కాదు.. వాహనహారం అనిపిస్తున్నది. సైకిళ్లు మొదలుకొని ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, డీసీఎం వ్యాన్లు, బస్సులతో రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నుంచి వాహనాల ప్రయాణం నెమ్మదిగా కొనసాగుతున్నది. వాహనాలతో వరంగల్ హైవే కిక్కిరిసిపోయింది. రైతులు, ప్రజలు సభకు త్వరగా వెళ్లేలా పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఆలేరు – వరంగల్ మధ్య, ఖమ్మం – వరంగల్ మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్న పోలీసులు జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ వైపు వెళ్లే రహదారులపై టీఆర్‌ఎస్ శ్రేణులు చల్లని నీరు, మజ్జిగ ప్యాకెట్లను అందజేస్తున్నారు. దార్లన్నీ జై తెలంగాణ నినాదాలతో మార్మోగిపోతున్నాయి.

Article Categories:
News · Telangana

Leave a Reply