Apr 21, 2017
116 Views
0 0

పాపం మంత్రి లోకేష్ మళ్లీ నోరుజారాడు

Written by

ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు, ఏపీ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ మళ్లీ నాలుక కరుచుకున్నారు. అర్థంపర్థంలేని మాటలతో జనాన్ని, పార్టీ నేతలను కంగారు పెట్టిస్తున్నారు. ఇటీవలే అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్ధంతి శుభాకాంక్షలని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లా బహిరంగ సభలో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పి నాలుక కరుచుకున్నారు. ఇక గురువారం ఈ రెండింటినీ మించిపోయే వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అయితే ఏపీలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 మాత్రమే. అలాంటప్పుడు టీడీపీని 200 స్థానాల్లో ఎలా గెలిపించాలో అర్థంకాక కార్యకర్తలు జుట్టు పీక్కున్నారు.

Article Categories:
Andhra Pradesh · News

Leave a Reply