Apr 18, 2017
183 Views
0 0

సమాచార హక్కు చట్టం గురించి తెలియని విషయాలు

Written by

అధికారుల్లో జవాబుదారీతనం, పాలనలో పారదర్శకత కోసం 2005 సంవత్స రంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమాచార హక్కు (రైట్ టు ఇన్‌ఫర్మేషన్ (ఆర్టీఐ)) చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పథకాల అమలు, పనుల పురోగతి తదితర విషయాలను సామాన్యులకు కూడా తెలపడమే ఈ చట్టం ఉద్దేశం. కార్యాలయాల నుంచి సమాచారం పొందడం ఎలా తదితర విషయాలు..

ఏయే సమాచారం?
* ప్రభుత్వ శాఖల వివరాలు, అమలవుతున్న పథకాలు, అధికారుల విధులు, ప్రతిపాదిత వ్యయం, వినియోగించిన విధానం.
సబ్సిడీ పథకాలు, లబ్ధ్దిదారుల వివరాలు, ఖర్చు చేసిన నిధుల వివరాలు.
* ప్రభుత్వ పథకాలు, రాయితీల వివరాలు, అనమతుల వివరాలు
* ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు, పత్రాలు, చెల్లించిన పన్నులు, సేకరించిన నిదులు, ఖర్చుల వివరాలు
* ప్రభుత్వం నుంచి జారీ అయిన మెమోలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
* గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ప్రతి కార్యాలయంలో సమాచారాన్ని తెలపడానికి సంబంధిత అధికారి (పీఐఓ) ఉంటారు.
* దరఖాస్తుదారుడు పీఐఓ పేరు మీద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సమాచారం సేకరించిన తరువాత దరఖాస్తుదారుడికి సంబంధిత సమాచారం ఇవ్వడానికి తాను ఉంటున్న చిరునామాను అందజేయాలి.
* దరఖాస్తుదారుడు తాను కోరుకున్న సమాచారానికి కారణాలు తెలపాల్సిన అవసరం లేదు.
* వయస్సు, విద్యార్హతలతో సంబంధం లేకుండా ఎవరైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

సమాచారం ఇవ్వకపోతే..?
* కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో సంబంధిత అధికారి తెలపకపోతే సదరు దరఖాస్తుదారుడు అప్పిలేట్, నోడల్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. వారు స్పందించని పక్షంలో 90 రోజుల్లో నేరుగా రాష్ట్ర కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
* కేసు నమోదైన తరువాత రాష్ట్ర కమిషనర్ కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటారు.
* గడువు లోపల సమాచారం ఇవ్వని పక్షంలోదరఖాస్తుదారుడికి రోజుకు రూ.250 నుంచి రూ.25వేల వరకు పరిహారం చెల్లించేలా ఈ చట్టం రూపొందించబడింది.

మినహాయింపు
* దేశ భద్రత, వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు, విదేశీ సంబంధ విషయాలు, దేశానికి సంబంధించిన కీలక సమాచారం తెలిపే విషయాలు
* న్యాయస్థానాల్లో విచారణకు రానున్న, విచారణలో ఉన్న సమాచారం. నేరస్తుల ప్రాసిక్యూట్‌కు అవరోధాలు కలిగించే సమాచారం.
* పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని పొందలేరు.

Article Tags:
· · · ·
Article Categories:
Education

Leave a Reply