Apr 11, 2017
120 Views
0 0

బిత్తిరి సత్తి పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవనుంది- నిర్మాత

Written by

రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా నటిస్తున్న చిత్రం ఇద్దరి మధ్య 18. నాని ఆచార్య దర్శకుడు. తీన్‌మార్ వార్తలు ఫేమ్ బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శివరాజ్ పాటిల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఓ వినూత్నమైన ప్రేమకథగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వినోదంతో పాటు మంచి సందేశం కూడా వుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాష్ట్ర మంత్రి వర్యులు తన్నీరు హరీశ్‌రావుగారు సినిమా చూసి మంచి చిత్రాన్ని నిర్మించారని అభినందించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం తప్పకుండా యువతను ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. తీన్‌మార్ వార్తలు ఫేమ్ బిత్తిరి సత్తిపై చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. కొత్త పంథాలో చేసిన మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

Article Categories:
Sainamaalu · Tollywood

Leave a Reply