Apr 3, 2017
198 Views
0 0

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

Written by
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులకు శాఖలు మంత్రులకు శాఖలు ఖరారు. మంత్రి వర్గంలోకి కొత్తగా 11 మంది చేరగా, 5గురు మంత్రులు తమ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మంత్రులకు కేటాయింపులతో ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల కేటాయింపులో కూడా కొన్ని మార్పులు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఇదే..
నారా చంద్రబాబునాయుడు: ముఖ్యమంత్రి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మైనారిటీ సంక్షేమం-ఉపాధి, సినిమాటోగ్రఫీ, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

కే.ఈ. కృష్ణమూర్తి: ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు
నిమ్మకాయల చినరాజప్ప: ఉపముఖ్యమంత్రి, హోం, విపత్తు నిర్వహణ శాఖలు
యనమల రామకృష్ణుడు: ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు

నారా లోకేష్‌: ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి
కిమిడి కళా వెంకట్రావు: ఇంధనశాఖ
కింజరాపు అచ్చెన్నాయుడు: రవాణా, బీసీ సంక్షేమం, చేనేత, జౌళిశాఖ

వెంకట సుజయ్‌కృష్ణ రంగారావు: భూగర్భ, గనుల శాఖ
సీహెచ్‌. అయ్యన్నపాత్రుడు: రోడ్లు, భవనాల శాఖ
గంటా శ్రీనివాసరావు: మానవవనరుల అభివృద్ధి, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా శాఖ

కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌: ఎక్సైజ్‌శాఖ
పితాని సత్యనారాయణ: కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు శాఖ
పైడికొండల మాణిక్యాల రావు: దేవాదాయ శాఖ

కామినేని శ్రీనివాసరావు: ఆరోగ్య, వైద్య విద్య శాఖ
కొల్లు రవీంద్ర: క్రీడలు, న్యాయ, నైపుణ్యాభివృద్ధి, ఎన్‌ఆర్‌ఐ సంబంధాల శాఖ
దేవినేని ఉమా మహేశ్వరరావు: జల వనరుల శాఖ

నక్కా ఆనంద బాబు: సామాజిక, గిరిజన సంక్షేమం
ప్రత్తిపాటి పుల్లారావు: ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ధరల నియంత్రీకరణ
శిద్దా రాఘవరావు: అటవీ, వాతావరణ, శాస్త్ర సాంకేతిక

పొంగూరు నారాయణ: పురపాలక, పట్టణాభివృద్ధి
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి: వ్యవసాయం.. అనుబంధ శాఖలు, ఉద్యానశాఖ
ఆదినారాయణరెడ్డి: మార్కెటింగ్‌, వన్యప్రాణుల సంరక్షణ, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ

భూమా అఖిల ప్రియ: పర్యాటకం, తెలుగు భాష, సంస్కృతి
కాలవ శ్రీనివాసులు: గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాలు
పరిటాల సునీత: సెర్ప్‌, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం
ఎన్‌ అమరనాథ్‌రెడ్డి: పరిశ్రమలు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌

 

 

Article Categories:
Andhra Pradesh · News

Leave a Reply