Mar 25, 2017
225 Views
0 0

దుమారం రేపుతున్న కలెక్టర్ వ్యాఖ్యలు…వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ ఆదేశం

Written by

ఆయన ఒక జిల్లా కలెక్టర్ కొద్ది రోజుల క్రితం తన కూతరుకి ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి శభాష్ అనిపించుకున్నాడు. ఇంతలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమయ్యాడు.శుక్రవారం  ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పడు పెద్ద దుమారంగా మారాయి.కలెక్టర్ చెప్పింది ఆరోగ్యం కాపాడుకోవాలని…అందుకు ఇవి తినాలి అని చెప్పి ఇరకాటంలో పడ్డారు. తను చేసిన వ్యాఖ్యల్లో కుల ప్రస్తావన రావడంతో ఆయన చెప్పిన మాటలు కూడా బుడిదలో పోసిన పన్నీర్ లా మారాయి.ఇక…అసలు వియానికి వస్తే…..

ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా నిన్న జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏటూరునాగారం మండలకేంద్రంలో నిర్వహించిన ర్యాలీ లో కలెక్టర్ మురళి పాల్గొని మాట్లాడారు.అడవి పంది, గొడ్డు మాంసం పుష్కలంగా తినండి. కంది పప్పు తినండి. ఇవి తింటే బలం, క్షయ దరిచేరదు. మాంసం ఎక్కువ ఖరీదు అనుకుంటే పక్కనే ఉన్న అడవి పందులను పట్టుకొని తినండి. దరిద్రపు బ్రాహ్మనిజం కల్చర్ వచ్చి, పెద్ద మాసం తినొద్దు. అదీ, ఇదీ, గాడిద గుడ్డు అని చెప్పి బంద్ చేయించారు.

రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నేను పల్లెనిద్ర చేసినపుడు ముసలివాళ్లు చెప్పారు… గొడ్డు కూర తినాలని ఉన్నా , ఊళ్లో తిననీయడం లేదు, ప్రాణం కొట్టుకుంటున్నదన్నారు. గొడ్డు కూర తిన్నపుడు వ్యవసాయం, కూలిపని బాగా చేసేవాళ్లమని, ఎప్పుడైతే తినడం ఆపామో ఒంట్లో సత్తువ లేకుండా పోయిందన్నారు. జిల్లాలో ములుగు మండలం అంకన్నగూడెంకు వెళ్లినప్పుడు కొందరు ఆ దేవుడు, ఈ దేవుడు పేరిట పిచ్చిమాలలు వేసుకుని పందిమాంసం తినడం బంద్‌చేశారు. ఏందో మాల వేసుకుంటున్నారంటా! అదేందో గాడిద గుడ్డు, అదంతా వేస్ట్. హ్యాపీగా మనం ఏం తినాలో అదే తినాలి. అప్పుడే శరీరం బాగుంటుంది. అడవి పందులు పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అడవి పంది మాంసం తినొచ్చని, వాటిని పట్టుకోవచ్చని ఈ మధ్య కేంద్ర అటవీశాఖ నిర్ణయం తీసుకున్నది. ఇది నేరం కాదు. నెమలి, దుప్పి, ఇతర మాంసం మాత్రం తినొద్దు. అడవి పందిని తింటే ఎలాంటి కేసులు లేవు. సమస్యలు లేవు. ఎప్పుడైనా పందిమాంసం వస్తే నాకు కూడా పెట్టండి.. నేను ఎప్పుడూ తినలేదు అని కలెక్టర్ మురళి వ్యాఖ్యానించారు.ఇప్పటికే తన వ్యాఖ్యలపై కలెక్టర్ క్షమాపణ కూడా చెప్పారు.

ఇదే విషయం పై ఇవాళ తెలంగాణ శాసనమండలిలో చర్చ జరిగింది. దీనిపై మంత్రి జోగు రామన్న స్పందిస్తూ కలెక్టర్ వ్యాఖ్యలపై వివరణ అడిగామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ .. కలెక్టర్ కు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే బ్రహ్మణ సంఘాలు తెలంగాణ డీజీపీ కి ఫిర్యాదు చేశాయి.

Article Categories:
News · Telangana

Leave a Reply