Mar 1, 2017
590 Views
0 0

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారా….?

Written by

ఎవరు ఊహించని కాంబినేషన్ త్వరలో పట్టాలెక్కనుంది. బాలయ్య తన వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంతో అభిమానుల ఆనందాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగా, 101వ సినిమాపై కొన్నాళ్లుగా సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఫైనల్ గా 101 వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్నట్టు ప్రకటించేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా రూపొందనున్న ఈ చిత్రం మార్చి 9న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా మేకర్స్ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 23 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న మేల్, ఫీమేల్ వ్యక్తులు ఈ చిత్రంలో నటించే గొప్ప ఛాన్స్ అందుకోవచ్చంటూ తెలిపారు. ఇక ఈ చిత్రంలో విలన్ గా పూరీ కొత్త వ్యక్తిని తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఆసక్తి గల వారు మీ కంప్లీట్ ప్రొఫైల్ ని casting@puriconnects.com కి పంపించి, బాలయ్య సినిమాలో నటించే గొప్ప ఛాన్స్ అందుకోవచ్చు. పూరీ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

Article Categories:
Sainamaalu · Tollywood

Comments to సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారా….?

  • Bramahaiah age 24

    Rishkrish143@gmail March 5, 2017 7:05 am Reply

Leave a Reply