Jan 29, 2017
133 Views
0 0

షారుక్ మార్కెటింగ్ కబుర్లు

Written by

”ఏ సినిమా అయినాసరే, ఇప్పుడు ముందుగా మార్కెటింగ్‌ గురించి కూడా ఆలోచించుకున్నాకే సెట్స్‌ మీదకు తీసుకురావాలి. ఆ మార్కెటింగ్‌ సినిమాకి చాలా హెల్పవుతుంది. మార్కెటింగ్‌ చేయడం ద్వారా డబ్బులు సంపాదించేసుకోవచ్చన్నది వేరే విషయం. టాలీవుడ్‌ అయినా, కోలీవుడ్‌ అయినా, బాలీవుడ్‌ అయినా.. ఇప్పుడు ఇండియా యూనిట్‌గా తీసుకుని సినిమాలు తెరకెక్కించడం వల్ల ఎక్కువ ప్రయోజనం వుంటుంది. ఆయా సినీ రంగాల్లో మన సినిమా మార్కెట్‌ ఏంటి? అన్నదానిపై ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలి..” అంటూ బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ఖాన్‌, ప్రస్తుత సినీ ట్రెండ్‌ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేశాడు.

నిజమే మరి, ఇప్పుడు బాలీవుడ్‌ హీరోలు ఇతర భాషల్లోనూ తమ సినిమాల్ని విడుదల చేయడమే కాదు, వాటి ప్రమోషన్‌ కోసం దేశమంతా తిరిగేస్తున్నారు. ఇదో మార్కెటింగ్‌ టెక్నిక్‌. అదే సమయంలో, మన సౌత్‌ నుంచి తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా హిందీ మార్కెట్‌ని కూడా దృష్టిలోపెట్టుకుంటోంది. ‘బాహుబలి’ ఇతర భాషలతోపాటు, బాలీవుడ్‌పైనా వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు మరి.! ప్రస్తుతానికైతే టాలీవుడ్, కోలీవుడ్ ఫోకస్.. ఇంకా పూర్తి స్థాయిలో బాలీవుడ్ దాకా వెళ్ళలేదు, భవిష్యత్తులో వెళుతుందన్నది నిర్వివాదాంశం.

సినీ మార్కెటింగ్ కబుర్లు :

ఇండియన్‌ సినిమా అంటే.? ‘బాహుబలి’ అని ఓ సందర్భంలో షారుక్‌ వ్యాఖ్యానించాడట.. అదీ, ఎక్కడో విదేశాల్లో. చిన్న విషయం కాదిది. తెలుగు సినిమా అంటే తెలుగు నేటివిటీ, తమిళ సినిమా అంటే తమిళ నేటివిటీ.. అన్న భావనలు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే కన్పిస్తున్నాయి. సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళాక, దానిపై క్రియేట్‌ అయిన హైప్‌ని దృష్టిలోపెట్టుకుని, ఇతర భాషల్లో మార్కెటింగ్‌ గురించి కొందరు ఆలోచిస్తున్నారు.

షారుక్‌ చెప్పినట్లుగా, ఇకపై సినిమా నిర్మాణానికి ముందే ఇతర భాషలపైనా పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టగలిగితే, అప్పుడిక కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌.. అన్న తేడాలుండవు. అంతా కలిసి ఇండియన్‌ సినిమా అనే గొడుగు కిందకే వచ్చేస్తాయ్‌.

Article Categories:
Bollywood · Business

Leave a Reply